ఉడత సాయం
పిల్లలు అమ్మకూ, నాన్నకూ సాయం చెయ్యాలనుకుంటుంటారు.ఒక్కో సారి వారు చేసే సాయం నిజానికి ఎక్కువ ఉపయోగపడక పోవచ్చు.అయినా వారి ప్రయత్నాన్ని పెద్దలు అభినందిస్తారు. శ్రీ రాముడు "ఉడత" సాయాన్ని అభినందించినట్లు.... |  |
| వానర సేన సముద్రం మీదుగా లంకకు వంతెన కడుతున్నారు.అందుకోసం వాళ్ళు పెద్ద పెద్ద బండ రాళ్ళను సముద్రంలో పడేస్తున్నారు.అది చూసిన ఒక ఉడత తనూ సాయం చెయ్యాలనుకుంది.చిన్న చిన్న రాళ్ళను తీసుకు వెళ్ళి సముద్రంలో వెయ్య సాగింది.వానరులు అది చూసి నవ్వుకున్నారు. "ఆ చిన్న రాళ్ళు వంతెనకు ఏమి పనికి వస్తాయి?" అనుకున్నారు. | |
| శ్రీ రాముడు మాత్రం ఉడత చేస్తున్న ప్రయత్నాన్ని గమనించి, ఉడతను దగ్గరకు తీసుకుని ప్రేమగా దాని వీపు నిమిరాడు. ఉడత వీపు మీద ఉండే చారలు దానికి సాక్ష్యమట. |  |

This work is licensed under a
Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.